శ్రీ గణేశాయ నమః
శ్రీ మాత్రే నమః – శుభ గ్రహ
రాహుగ్రస్త ఖండగ్రాస పాక్షిక చన్ద్ర గ్రహణం
28.08.2026, శ్రీ పరాభవ నామ సం, శ్రావణ పౌర్ణమి/ప్రతిపద, గురువారం రాత్రి/శుక్రవారం ఉదయాత్పూర్వం, “రాహుగ్రస్త ఖండగ్రాస పాక్షిక చన్ద్ర గ్రహణం” సంభవించ నున్నది. ఇట్టి గ్రహణం భారతదేశంలో “అదృశ్య” అనగా కనబడదు. కావున భారతదేశంలో ఇట్టి గ్రహణానికి చెందిన పట్టింపులు (అశౌచం ఇత్యాది) వర్తించవు. ఆచరించాల్సిన అవసరం లేదు. భారతదేశంలో కూడా గ్రహణం ఉందనే తప్పుడు సమాచారాలు సామాజిక మాధ్యమాలలో వస్తున్నాయి. వాటిని నమ్మరాదు. ఇట్టి గ్రహణం ఐరోపా, పశ్చిమ ఆసియా, ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, పసిఫిక్, హిందూ మహా సముద్రం, అంటార్కిటికా ప్రాంతాలలో కనిపిస్తుంది. కొన్ని ప్రధాన నగరాల వివరాలు కింద ఇవ్వబడింది:
Budapest - Hungary, Vienna - Austria, Lagos - Nigeria, Santiago - Chile, Amsterdam – Netherlands, Paris – France, Caracas – Venezuela, Rome – Italy, Lima – Peru, Mexico, Montreal, Quebec – Canada, Brussels – Belgium, San Salvador – El Salvador, Lisbon – Portugal, Havana – Cuba, Casablanca – Morocco, Johannesburg – S Africa, Dublin – Ireland, New York – USA, Algiers – Algeria, Madrid – Spain, Washington DC – USA, Brazil, London, Buenos Aires – Argentina, Guatemala, Dominical Republic, Berlin – Germany, Croatia, Prague – Czechia etc.
గ్రహణ సమయాలు (UTC లేదా GMT సమయం ప్రకారం. ఆయా ప్రాంతాల వారు ఈ సమయానికి తమ ప్రాంత సమయం యొక్క సవరణ చేసుకొని చూసుకోవాలి):
స్పర్శ 01:24
నిమీలనం 02:34
మధ్య 04:13
ఉన్మీలనం 05:52
మోక్షం 07:02
ఆద్యంత పుణ్యకాలం 5 గం 38 ని.
ఇట్టి గ్రహణం శతభిష నక్షత్ర కుంభ రాశిలో సంభవించుట వలన ఇట్టి నక్షత్రంలో జన్మించిన వారు మరియు కుంభ, కర్కాటక రాశులలో జన్మించిన వారు చూడరాదు. మేష కన్యా మరియు ధనుస్సు రాశుల వారికి శుభ ఫలం, మిగిలిన రాశుల వారికి మధ్యమ ఫలం. అది కూడా గ్రహణం ఎక్కడం కనిపిస్తుందో ఆ ప్రాంతం వారికి మాత్రమే. శతభిష నక్షత్రం వారు, కుంభ మీన మరియు కర్కాటక రాశులలో జన్మించిన వారు గ్రహణ శాంతి చేసుకోవాలి.
నమిలికొండ విశ్వేశ్వర శర్మ