Bhagavadgita-001

విశిష్టులందరినీ జ్ఞానులని అనవచ్చునా?


‘అధికారికపుంసాం తు బృహత్కర్మత్వకారణాత్

ఉద్భవాభిభవౌ జ్ఞానే తతోఽన్యేభ్యో విలక్షణాః ।।

 ఇతి అత ఏవ వైలక్షణ్యాదనధికారిణామాగ్రహాది (పా: అనాధికారికాణామ్) చేదస్తి న తే జ్ఞానిన, ఇత్యవగన్తవ్యమ్ (శ్రీమద్భగవద్గీత మధ్వాచార్య భాష్యం ౨-౫౫

వ్యక్తులు వారు ఆచరించే బృహత్కర్మల వలన మరియు వారిలోని మహోన్నతమైన గుణాల వలన గుర్తించ బడతారు, కీర్తించబడతారు. వారు ఇతరులకంటే భిన్నంగా కూడా ఉంటారు. కావున, వారి ప్రత్యేక గుణముల వలన వారు యోగ్యత లేనివారు కనుక విశిష్టులైనప్పటికీ, వారిని ‘జ్ఞానులు’ అని పిలవలేరు, ఈ విధంగా అర్థం చేసుకోవాలి. 

విశిష్టుడే కాని జ్ఞాని కాడు – జ్ఞానిగా గుర్తించ బడడానికి గాను కొన్ని ప్రత్యేకమైన నిబంధనలు ఉంటాయి. ప్రత్యేకమైన విద్యార్హతలు గల వారు, విశిష్టమైన కార్యాలను నిర్వహించు వారు, వేదాంతులు, ప్రవచన కర్తలు, ఆధ్యాత్మిక మరియు భక్తి మార్గాలలో గల వారు, తమను తాము పీఠాధిపతులమని చెప్పుకొను వారు, ఇత్యాది మరెందరో మనకు లోకంలో కనిపిస్తారు. నిజానికి వీరందరూ కూడా జ్ఞానులు కారు. వీరందరూ కూడా విశిష్టులే, కాని జ్ఞానులు మాత్రం కాదు. ‘అధికారికపుంసాం తు బృహత్కర్మత్వకారణాత్’ వ్యక్తులు వారు ఆచరించే బృహత్కర్మల వలన మరియు వారిలోని మహోన్నతమైన గుణాల వలన గుర్తించ బడతారు, కీర్తించబడతారు. వారు ఇతరులకంటే భిన్నంగా కూడా ఉంటారు. కావున, వారి ప్రత్యేక గుణముల వలన వారు యోగ్యత లేనివారు కనుక విశిష్టులైనప్పటికీ, వారిని ‘జ్ఞానులు’ అని పిలవలేరు. జ్ఞానులైన వారు జన్మాంతరకృత వాసనలకు అతీతులై ఉంటారు. బాహ్య వస్తు మరియు విషయములకు చెందిన స్పందన వారిలో ఉండదు. వారు ‘జ్ఞానినస్తత్వదర్శినః’ తత్త్వజ్ఞాన సంపన్నులు, పరమార్థ సత్యాన్ని ఎరిగిన వారు శ్రీహరి పాద దర్శనాన్ని ఆకాంక్షించు వారు. 


నమిలికొండ విశ్వ్వేశ్వర శర్మ