07.09.2025 సంపూర్ణ చంద్ర గ్రహణం
భాద్రపద పౌర్ణిమ ఆదివారం, పూర్వాభాద్ర నక్షత్ర యుక్త కుంభ రాశి స్థిత పింగళవర్ణ రాహుగ్రస్త సవ్యగ్రహణం. ఇట్టి చంద్ర గ్రహణం భారత దేశం అంతటా కనిపిస్తుంది. ఐరోపా, ఆసియ, ఆస్ట్రేలియా, ఆఫ్రికా, ఉత్తర అమెరికాలో పడమర భాగం, దక్షిణ అమెరికాలో తూర్పు భాగం, పసిఫిక్, అట్లాంటిక్, హిందూ మహాసముద్రం, ఆర్కిటిక్ మరియు అంటార్కిటికా ప్రాంతాలలో కనిపిస్తుంది. భారతదేశంలో సంపూర్ణంగా కనిపిస్తుంది.
ఛాయ ప్రవేశ: 20::58 Hrs (రా 08:58)
స్పర్శ: 21:57 Hrs (రా 09:57)
నిమీలనం: 23:00 Hrs (రా 11:00)
మధ్య: 23:42 Hrs (రా 11:42)
ఉన్మీలనం: 00:22 Hrs (రా 12:22)
మోక్షం: 01:26 Hrs (రా/ఉదయాత్పూర్వం 08.09.2026 - 01:26)
ఛాయా నిష్క్రమణ: 02:25 Hrs (రా/ఉదయాత్పూర్వం 08.09.2026 02:25)
ఆద్యంత పుణ్యకాలం: గం 03:30 ని
పూర్ణిమా ప్రయుక్త నిత్యభోజనాలు మధ్యాహ్నం 01:00 లోగా ముగించాలి. వృద్ధులు, రోగ గ్రస్తులు, చిన్నారులు సాయంకాలం సా 06:00 లోగా ముగించాలి. సా 06:00 పిదప భోజనాదులు చేయరాదు. గర్భిణీ స్త్రీలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.
గ్రహణ ఫలం;
ఇట్టి గ్రహణాన్ని పూర్వాభాద్ర నక్షత్ర జాతకులు, కుంభ మరియు కర్కాటక రాశుల వారు వీక్షించ రాదు. వృశ్చిక, మరియు మీన రాశుల వారు కూడా వీక్షించ రాదు. ఈ నాలుగు రాశుల వారికి ఫలం - అధమం. వీరు గ్రహణ శాంతి జరుపుకోవాలి.
మిథున, సింహ, తుల మరియు మకర రాశుల వారికి - ఫలం మధ్యమం. వీరికి శాంతి అవసరం లేదు
మేష, వృషభ, కన్య మరియు ధనుస్సు రాశుల వారికి - శుభకరము. వీరికి కూడా శాంతి అవసరం లేదు.
*గ్రహణ శాంతి:*
వెండితో చేసిన చంద్ర బింబం మరియు రాహువు బింబమును రాగి పాత్రలో ఆవు నెయ్యి గాని ఆవు పాలలో గాని వేసి సంకల్ప యుక్తంగా దానం ఇవ్వాలి.
*నమిలికొండ విశ్వేశ్వర శర్మ, సిద్ధాంతి*