Partial Lunar Eclipse 2023

శ్రీ గణేశాయ  నమః - శ్రీ మాత్రే నమః - శుభాగ్రహ

రాహుగ్రస్త ఖండగ్రాస పాక్షిక చన్ద్ర గ్రహణం

28.10.2023, ఆశ్వయుజ పౌర్ణమి, స్థిరవాసరే, అశ్విని నక్షత్రే, కర్కాటక లగ్నే, మేష రాశ్యాం రా గం 01:08 ని రాహుగ్రస్త ఖండగ్రాస పాక్షిక చన్ద్ర గ్రహణం

దక్షిణాగ్నేయ ఆసన్నే స్పర్శః – దక్షిణాసన్నే మోక్షః

ఇట్టి గ్రహణము ఐరోపా, ఆసియా, ఆస్ట్రేలియా, ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా యొక్క చాలా భాగాలు, పసిఫిక్, అట్లాంటిక్, హిందూ మహా సముద్రం, ఆర్కిటిక్ మరియు అంటార్కిటికా అన్ని ప్రాంతాలలో గాని లేదా కొన్ని ప్రాంతాలలో గాని కనిపిస్తుంది. ఇది ఎక్కడ కనిపిస్తుందో వారికి మాత్రమే గ్రహణ నియమాలు వర్తిస్తాయి. 

భారతకాలమానం గ్రహణ సమయాలు:

28.10.2023 రాత్రి

స్పర్శ                     గం 01:06 ని
మధ్యకాలం             గం 01:44 ని
మోక్ష కాలం             గం 02:22 ని
ఆద్యంత పుణ్యకాలం గం 01:16 ని

ఇట్టి గ్రహణాన్ని మేష, వృషభ, కన్యా, తుల, ధనుస్సు, మకర మరియు మీన రాశుల వారు చూడ రాదు. వీరు గ్రహణ శాంతి చేసుకోవాలి.

నిత్య భోజనాదులు:

ప్రత్యాబ్దికములు యథా కాలమందు, యథావిధిగా నిర్ణయించుకోవచ్చు. రాత్రి భోజనం మాత్రం చేయరాదు. ఇట్టి భోజన నియమాలు, పిల్లలకు, వృద్ధులకు మరియు రోగగ్రస్తులకు వర్తించదు. గర్భిణీ స్త్రీలు గ్రహణ నియమాలను పాటించాలి.

గ్రహణ గోచారము:

మేష – వృషభ – కన్య – మకర రాశుల వారికి అధమ ఫలమ్
సింహ – తుల – ధనుస్సు – మీన రాశుల వారికి మధ్యమ ఫలమ్
మిథున – కర్కాటక – వృశ్చిక – కుంభ రాశుల వారికి శుభ ఫలమ్

స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం – న్యాయేన మార్గేణ మహీం మహీశాః ।
గో బ్రాహ్మణేభ్య శ్శుభమస్తు నిత్యం – లోకాస్సమస్తా స్సుఖినోభవంతు ।।
स्वस्ति प्रजाभ्यः परिपालयन्तां - न्यायेन मार्गेण महीं महीशाः ।
गोब्राह्मणेभ्यः श्षुभमस्तु नित्यं - लोकाः समस्ता सुखिनो भवन्तु ।।

నమిలికొండ విశ్వేశ్వర శర్మ, సిద్ధాంతి
नमिलिकोण्ड विश्वेश्वर शर्म, सिद्धान्ति
శ్రీ గాయత్రి వేద విజన్, హన్మకొండ