Total Solar Eclipse 2024

శ్రీ గణేశాయ నమః
శ్రీ మాత్రే నమః - శుభ గ్రహ

రాహుగ్రస్త సంపూర్ణ సూర్య గ్రహణం 2024

శ్రీ శోభన నామ సం ఫాల్గుణ అమావాస్య, సోమవారం, ది 08.04.2024 నాడు రాహువు గ్రస్త సంపూర్ణ సూర్య గ్రహణం. సూర్య గ్రహణం కనబడు ప్రాంతాలు:

Total Solar Eclipse Visible in:
Mexico ((from Sinaloa to Coahuila),
USA (from Texas to Maine, Arkansas, Illicois, Indiana, Kentucky, Maine, Michigan, Missouri, N Hampshire, New York, Ohio, Oklahoma, Pennsylvania, Tennessee, Texas, Vermont. Partial to almost Total Eclipse is visible in all the remaining parts of USA),
Canada (from Ontario to Newfoundland) 

Partial Solar Eclipse Visible in:
A partial eclipse will be visible across nearly all of North America, and a sliver of western Europe. 

Note:
Please check Local Eclipse timings from:
www.timeanddate.com/eclipse/solar/2024-april-8 

ముఖ్య గమనిక:
ఇట్టి సంపూర్ణ సూర్య గ్రహణం భారతదేశంలో కనిపించదు. కావున భారతదేశంలో నివసించు వారికి గ్రహణ నియమాలు వర్తించవు.

ఇట్టి సూర్య గ్రహణం రేవతి నక్షత్ర మీన రాశి యందు సంభవించుట వలన రేవతి నక్షత్ర, మీన రాశిలోను మరియు సింహ రాశిలోను జన్మించిన వారు గ్రహణాన్ని వీక్షించ రాదు. మరియు పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర నక్షత్ర జాతకులు కూడా చూడరాదు. అంతేకాదు ధనుస్సు, కన్య రాశి వారు కూడా వీక్షించ రాదు. వీరందరూ గ్రహణ శాంతి జరుపుకోవాలి. ఇట్టి గ్రహణము వృషభ, తుల మరియు మకర రాశుల వారికి శుభ ఫలితాలను ఇస్తుంది. మిగిలిన వారికి మధ్యమ ఫలితాలను ఇస్తుంది. గర్భవతులైన స్త్రీలు గ్రహణ నియమాలను పాటించాలి.

గ్రహణ శాంతికి దానం:
రాగి పాత్రలో ఆవు పాలు పోసి, అందులో ఒక సర్ప ప్రతిమ మరియు ఒక సూర్య ప్రతిమను ఉంచి సంకల్ప యుక్తంగా బ్రాహ్మడికి దానాలు చేసుకోవాలి.

నమిలికొండ విశ్వేశ్వర శర్మ, సిద్ధాంతి