(Important Disclaimer: This essay is entirely unbiased. It has been written solely with the welfare of humanity in mind and for the greater good of the world (Loka Sangraha). It is not directed at any specific individual, group, or country. Please understand that this is purely a philosophical and Vedantic analysis of the subject.)
While the modern world touches the pinnacles of technology, humanity's fundamental ignorance is baring its fangs in the form of devastating wars. The fierce conflicts raging across the globe today invoke a deep fear that the world is heading towards total destruction rather than human welfare. Man's ever-growing egoistic tendencies and his attachment to material objects (Vastu-Vishaya Sangam) are becoming rampant day by day. These wars are not merely fought over national borders; they are a direct reflection of the leaders' egos and their intense, deep-rooted infatuation with material possessions and territories. Let us attempt to analyze this through the authoritative lenses of Vedanta, Dharma Shastras, and Itihasas:
1. The Bhagavad Gita's Authority: The Downfall of Rulers
Verses 62 and 63 from the second chapter (Sankhya Yoga) of the Bhagavad Gita accurately describe the psychological state of today's war-mongering leaders:
ध्यायतो विषयान्पुंसः सङ्गस्तेषूपजायते । सङ्गात्सञ्जायते कामः कामात्क्रोधोऽभिजायते ॥ क्रोधाद्भवति सम्मोहः सम्मोहात्स्मृतिविभ्रमः । स्मृतिभ्रंशाद्बुद्धिनाशो बुद्धिनाशात्प्रणश्यति ॥
dhyāyato viṣayānpuṁsaḥ saṅgasteṣūpajāyate | saṅgātsañjāyate kāmaḥ kāmātkrodho'bhijāyate ||
krodhādbhavati sammohaḥ sammohātsmṛtivibhramaḥ | smṛtibhraṁśādbuddhināśo buddhināśātpraṇaśyati ||
Sangam (Attachment): By constantly dwelling on the territories or resources of neighboring countries, leaders develop a deep sangam (attachment) towards them.
Kama (Desire) and Krodha (Anger): This attachment transforms into a kama (desire) to conquer. When this desire is thwarted by other nations or international laws, it erupts into krodha (anger).
Sammoha (Delusion) and Smriti Vibhrama (Loss of Memory): Blinded by anger, they lose their sense of discrimination, leading to sammoha (delusion). Consequently, they forget the devastating lessons taught by history and past world wars (smṛti vibhrama).
Buddhi Nasha (Loss of Intellect) - Total Destruction: Finally, the intellect that distinguishes right from wrong is destroyed (buddhi nāśa). A ruler devoid of intellect makes catastrophic decisions, ultimately leading to the total destruction of himself, his country, and the world.
2. Evidence from the Mahabharata: Ego as the Genesis of the Fall
The obstinacy of modern leaders brings to mind the arrogance of Duryodhana in the Mahabharata. When Lord Krishna went as a peace messenger to avert the war, asking for merely five villages, Duryodhana's reply perfectly mirrored the attitude of modern imperialists.
सूच्यग्रं नैव दास्यामि विना युद्धेन केशव (Udyoga Parva) sūcyagraṁ naiva dāsyāmi vinā yuddhena keśava
Meaning: "O Keshava! Without a war, I shall not yield even as much land as can be pierced by the point of a needle."
Application: In today's conflicts as well, leaders refuse diplomatic resolutions. They sacrifice millions of soldiers and innocent lives for a few inches of land. Just as Duryodhana's stubbornness led to the annihilation of 18 Akshauhinis (army divisions) at Kurukshetra, the rigid stance of today's leaders is leading to similar devastation.
3. Famous Proverb: 'Excess' (Ati) is the Cause of All Disasters
As the Gita states, when attachment to objects and desires crosses the limit—when it becomes Ati (excessive)—it leads to a massive downfall. Our ancient proverb clearly warns about this:
अतिदानाद्धतः कर्णः अतिलोभात्सुयोधनः । अतिकामाद्दशग्रीवः अति सर्वत्र वर्जयेत् ॥
atidānāddhataḥ karṇaḥ atilobhātsuyodhanaḥ | atikāmāddaśagrīvaḥ ati sarvatra varjayet ||
Meaning: Karna was destroyed by his excessive generosity; Suyodhana (Duryodhana) by his excessive greed (refusing to share even needle-point sized land); and the ten-headed Ravana by his excessive lust. Therefore, Ati (excess) in anything is dangerous and should be avoided everywhere.
Application: Observing the conduct of current world leaders, Duryodhana's Ati Lobham (excessive greed) and Ravana's Ati Kamam (excessive desire for absolute power) are clearly visible. The excessive greed to occupy neighboring territories, coupled with the lust to control the globe, has blinded them.
4. Chanakya Niti: Avoid Extremes (Ati Sarvatra Varjayet)
Acharya Chanakya in his Niti Shastra brilliantly explains how extreme arrogance leads to destruction, echoing the same principle:
अतिदर्पे हता लङ्का अतिमाने च कौरवाः । अतिदाने बलिर्बद्धः सर्वत्र अति गर्हितम् ॥
atidarpe hatā laṅkā atimāne ca kauravāḥ | atidāne balirbaddhaḥ sarvatra ati garhitam ||
Meaning: Ravana's Lanka was destroyed due to excessive pride (Ati Darpam); the Kauravas were ruined by excessive arrogance (Ati Manam); and King Bali was bound due to excessive charity (Ati Danam). Therefore, 'excess' (Ati) is condemned everywhere.
Application: The excessive pride (Ati Darpam) of thinking "no one can challenge our military might" is blinding the leaders of today's superpowers. It is this exact arrogance that is turning matters, which could easily be resolved through peaceful dialogue, into pools of blood.
5. The Cost of War vs. Global Welfare
War brings no true benefit to any nation. Except for arms manufacturers, the common man is left only with grief. Reports indicate that trillions of dollars are currently being squandered on global wars. If these funds were redirected from destruction to global welfare:
Eradicating Hunger: Quality food could be provided to every starving person in the world for a lifetime.
Healthcare and Education: These funds are enough to finance research for fatal diseases and build state-of-the-art hospitals and schools in the remotest villages.
Environmental Protection: Green energy projects could be established to save the planet for future generations.
The money spent on manufacturing bombs could be used to build facilities that nurture millions of lives.
6. The War Through a Vedantin's Eyes
In the unbiased view of a Vedantin, this war is not a political chessboard; it is the spiritual downfall of humanity. To a Vedantin, geographical borders are artificial. The Upanishads declare: ईशावास्यमिदं सर्वम् (īśāvāsyamidaṁ sarvam - All this is pervaded by the Supreme Lord). Great emperors have claimed, "This land is mine, this empire is mine," but ultimately merged into the dust. Mother Earth supposedly laughs looking at them. Even a great conqueror like Alexander departed with empty hands.
These war-mongering leaders may shed blood to acquire many things and achieve numerous victories. But by obtaining all this, will their ego ever be fully pacified? It is impossible. The infatuation with objects and desires will haunt a man as long as he lives. Has such a person, despite achieving so much, ever found true happiness? Can he remain happy? The one clear, definitive answer is "No."
This is because all these possessions are प्रकृति संसिद्धम् (Prakriti Samsiddham - born of Nature). They are generated by Nature and belong solely to Nature, not to any individual human being.
Therefore, whatever man thinks he has "achieved" will perish one day. The very moment it perishes, he is left with nothing but sorrow and deep unrest. Hence, the Gita's profound statement, beautifully illuminated by Sri Adi Shankaracharya's commentary, perfectly applies to them:
अशान्तस्य कुतः सुखम् > aśāntasya kutaḥ sukham (How can there be happiness for one who has no peace?)
Destroying God-created Nature and living beings (including humans) merely for the sake of temporary, fleeting power is the pinnacle of ignorance. In the eyes of Vedanta, true victory is not in conquering the kingdoms of enemies, but in conquering the अरिषड्वर्ग (Arishadvargas - the six internal enemies: lust, anger, greed, delusion, pride, and jealousy) within oneself.
Conclusion: Only on the day humanity puts into practice the Sanatana Dharma's principle of वसुधैव कुटुम्बकम् (vasudhaiva kuṭumbakam - The whole world is one single family), will this attachment to material objects (vastu-viṣaya saṅgam) perish in leaders, establishing true peace in the world.
"स्वस्ति प्रजाभ्यः परिपालयन्तां - न्यायेन मार्गेण महीं महीशाः ।
गोब्राह्मणेभ्यः श्षुभमस्तु नित्यं - लोकाः समस्ता सुखिनो भवन्तु" ।।
(ముందుగా ప్రధాన గమనిక: ఈ వ్యాసం ఏ విధమైన పక్షపాత ధోరణితో వ్రాసింది కాదు. మానవ కళ్యాణాన్ని దృష్టిలో పెట్టుకొని, లోక సంగ్రహార్థం రచించిన వ్యాసం మాత్రమే. అంతేకాని ఏ ఒక్కరిని కాని, ఏ ఒక్క వర్గాన్ని కాని, ఏ ఒక్క దేశాన్ని కాని ఉద్దేశించి వ్రాసింది కాదు. విషయానికి చెందిన ఇదొక వేదాంత సంబంధ విశ్లేషణ మాత్రమే అని గ్రహించాలి)
వినాశనానికి మూలం అహంకారం - వ్యామోహం: ప్రస్తుత యుద్ధాలపై ఒక తాత్విక విశ్లేషణ
నేటి ఆధునిక ప్రపంచంలో ఒకవైపు సాంకేతికత శిఖరాలను తాకుతుంటే, మరొకవైపు మనిషి లోని ప్రాథమిక అజ్ఞానం యుద్ధాల రూపంలో కోరలు చాస్తోంది. ప్రస్తుతం ప్రపంచంలో జరుగుతున్న భీకర యుద్ధాలు మానవ కళ్యాణం బదులు విధ్వంసం వైపు ప్రపంచం దారితీస్తుందని భయం వేస్తుంది. మనిషిలో పెరిగిన అహంకార ప్రవృత్తి మరియు వస్తు విషయ సఙ్గం రోజురోజుకు ప్రబలుకుంటూ పోతుంది. ఈ యుద్ధాలన్నీ కేవలం దేశాల సరిహద్దుల కోసం జరుగుతున్నవి కావు; అవి నాయకుల అహంకారానికి, భౌతిక వస్తువుల పట్ల, భూభాగం పట్ల వారు పెంచుకున్న తీవ్రమైన వ్యామోహానికి నిలువుటద్దాలు. దీన్ని వేదాంత, ధర్మశాస్త్ర మరియు ఇతిహాస ప్రమాణాలతో విశ్లేషించే ప్రయత్నం చేద్దాము:
1. భగవద్గీత ప్రమాణం: పాలకుల పతనావస్థ
భగవద్గీతలోని రెండవ అధ్యాయం (సాంఖ్య యోగం) 62, 63 శ్లోకాలు ప్రస్తుత యుద్ధోన్మాద నాయకుల మానసిక స్థితికి అక్షరాలా సరిపోతాయి.
ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్తేషూపజాయతే | సంగాత్సంజాయతే కామః కామాత్క్రోధోऽభిజాయతే || క్రోధాద్భవతి సమ్మోహః సమ్మోహాత్స్మృతివిభ్రమః | స్మృతిభ్రంశా ద్బుద్ధినాశో బుద్ధినాశా త్ప్రణశ్యతి ||
సఙ్గం (Attachment): నాయకులు పక్క దేశపు భూభాగం లేదా వనరుల పట్ల నిరంతరం చింతన చేయడం వల్ల దానిపై 'సఙ్గం' (తీవ్రమైన వ్యామోహం) ఏర్పడుతుంది.
కామం మరియు క్రోధం: ఆ సఙ్గం ఆక్రమించుకోవాలనే 'కామం' (కోరిక)గా మారుతుంది. ఆ కోరికకు ఇతర దేశాల నుండో, అంతర్జాతీయ నియమాల నుండో అడ్డంకి ఎదురైనప్పుడు 'క్రోధం' (కోపం) కట్టలు తెంచుకుంటుంది.
సమ్మోహం మరియు స్మృతి విభ్రమము: ఆ కోపంలో విచక్షణా జ్ఞానం కోల్పోయి 'సమ్మోహం' కలుగుతుంది. దీనివల్ల గతంలో జరిగిన ప్రపంచ యుద్ధాల విధ్వంసాలను, చరిత్ర నేర్పిన పాఠాలను నాయకులు విస్మరిస్తారు (ఇదే స్మృతి విభ్రమము).
బుద్ధి నాశనం - సర్వనాశనం: చివరగా మంచి-చెడులను విశ్లేషించే 'బుద్ధి నశిస్తుంది'. బుద్ధి నశించిన పాలకుడు విధ్వంసకరమైన నిర్ణయాలు తీసుకుంటాడు. తద్వారా తనతో పాటు తన దేశాన్ని, ప్రపంచాన్ని నాశనం చేస్తాడు.
2. శ్రీ మహాభారత ప్రమాణం: అహంకారమే పతనానికి నాంది
ప్రస్తుత నాయకుల పట్టుదలను చూస్తే మహాభారతంలో దుర్యోధనుడి అహంకారం గుర్తుకురాక మానదు. శ్రీకృష్ణుడు స్వయంగా శాంతి దూతగా వెళ్లి, యుద్ధాన్ని నివారించడానికి కేవలం ఐదు ఊళ్లు అడిగినప్పుడు, దుర్యోధనుడు ఇచ్చిన సమాధానం నేటి సామ్రాజ్యవాదుల తీరును స్పష్టం చేస్తుంది.
"సూచ్యగ్రం నైవ దాస్యామి వినా యుద్ధేన కేశవ" (ఉద్యోగ పర్వం)
అర్థం: "ఓ కేశవా! యుద్ధం చేయకుండా, కనీసం సూదిమొన మోపినంత భూమిని కూడా నేను పాండవులకు ఇవ్వను."
అన్వయం: నేటి యుద్ధాలలో కూడా ఇరు పక్షాల నాయకులు దౌత్యపరమైన (Diplomatic) పరిష్కారాలకు రాకుండా, అంగుళం భూమి కోసం లక్షలాది సైనికులను, అమాయక ప్రజలను బలి తీసుకుంటున్నారు. దుర్యోధనుడి ఈ మొండి పట్టుదల వల్లే కురుక్షేత్రంలో 18 అక్షౌహిణిల సైన్యం నాశనమైంది. నేటి నాయకుల మొండి వైఖరి కూడా అటువంటి వినాశనానికే దారితీస్తోంది.
3. ప్రసిద్ధ లోకోక్తి (నీతి శాస్త్రం): 'అతి' సర్వ అనర్థ దాయకం
గీతలో చెప్పినట్లు వస్తు-విషయాల పట్ల సంగం (వ్యామోహం) శృతి మించినప్పుడు, అనగా 'అతి' అయినప్పుడు, అది మహా పతనానికి ఎలా దారితీస్తుందో మన ప్రాచీన లోకోక్తి ఎంతో స్పష్టంగా హెచ్చరిస్తోంది:
అతి దానాద్ధతః కర్ణః అతి లోభాత్ సుయోధనః | అతి కామాత్ దశగ్రీవః అతి సర్వత్ర వర్జయేత్ ||
అర్థం: మితిమీరిన దానగుణం వల్ల కర్ణుడు, సూదిమొన మోపినంత భూమిని కూడా ఇవ్వననే మితిమీరిన అత్యాశ (అతి లోభం) వల్ల సుయోధనుడు (దుర్యోధనుడు), ఇతరుల భార్యను అపహరించాలనే మితిమీరిన కోరిక (అతి కామం) వల్ల పది తలలు గల రావణాసురుడు సర్వనాశనమయ్యారు. కాబట్టి 'అతి' (మితిమీరడం) అనేది ఎక్కడైనా, ఎప్పుడైనా ప్రమాదకరమే.
అన్వయం: నేటి ప్రపంచ నాయకుల తీరును గమనిస్తే, వారిలో దుర్యోధనుని 'అతి లోభం', రావణుని 'అతి కామం' స్పష్టంగా కనిపిస్తున్నాయి. పక్క దేశాల భూభాగాలను, వనరులను ఆక్రమించుకోవాలనే మితిమీరిన అత్యాశ, ప్రపంచాన్ని మొత్తం తమ గుప్పిట్లో పెట్టుకుని శాసించాలనే అధికార దాహం వారి కళ్లు కప్పుతోంది. అహంకారం మరియు అత్యాశతో మొదలైన ఏ యుద్ధం కూడా శాశ్వత విజయాన్ని అందించలేదు; అది విజేతలను, పరాజితులను సమానంగా నాశనం చేస్తుంది.
4. చాణక్య నీతి: అతి సర్వత్ర వర్జయేత్
ఆచార్య చాణక్యుడు తన నీతిశాస్త్రంలో అహంకారం ఎలా నాశనానికి దారితీస్తుందో అద్భుతంగా వివరించాడు.
"అతిదర్పే హతా లంకా అతిమానే చ కౌరవాః | అతిదానే బలిర్బద్ధః సర్వత్ర అతి గర్హితమ్ ||"
అర్థం: విపరీతమైన గర్వం వల్ల రావణుడు లంకను నాశనం చేసుకున్నాడు, విపరీతమైన అహంకారం వల్ల కౌరవులు నాశనమయ్యారు. కాబట్టి 'అతి' అనేది ఎప్పుడూ ప్రమాదకరమే.
అన్వయం: "మా సైనిక శక్తిని ఎవరూ ఎదిరించలేరు" అనే 'అతి దర్పం' (Excessive pride) నేటి అగ్రరాజ్యాల నాయకులను అంధులను చేస్తోంది. ఈ అహంకారమే చర్చల ద్వారా పరిష్కరించుకోగల విషయాలను, నెత్తుటి కూపంగా మారుస్తోంది.
5. యుద్ధ వ్యయం - లోక కల్యాణ ప్రయోజనాలు
యుద్ధం ఏ దేశానికీ లాభాన్ని చేకూర్చదు. ఆయుధాల తయారీ సంస్థలకు తప్ప, సామాన్యులకు మిగిలేది శోకమే. నివేదికల ప్రకారం, ప్రస్తుత యుద్ధాల కోసం ప్రపంచవ్యాప్తంగా ట్రిలియన్ల కొద్దీ డాలర్లు (లక్షల కోట్ల రూపాయలు) ఖర్చు చేస్తున్నారు. ఒకవేళ ఈ సొమ్మును వినాశనానికి కాకుండా లోక కల్యాణానికి ఉపయోగిస్తే:
ఆకలి నిర్మూలన: ప్రపంచంలో ఆకలితో అలమటిస్తున్న ప్రతి ఒక్కరికీ జీవితకాలం పాటు నాణ్యమైన ఆహారాన్ని అందించవచ్చు.
వైద్యం మరియు విద్య: ప్రాణాంతక వ్యాధుల పరిశోధనలకు, మారుమూల గ్రామాల్లో అత్యుత్తమ ఆసుపత్రులు, పాఠశాలలు నిర్మించడానికి ఈ నిధులు సరిపోతాయి.
పర్యావరణ రక్షణ: భవిష్యత్ తరాల కోసం భూగోళాన్ని రక్షించే హరిత ఇంధన (Green Energy) ప్రాజెక్టులను నిర్మించవచ్చు. బాంబుల తయారీకి వెచ్చించే ఖర్చుతో, కోట్ల బ్రతుకులను నిర్మించే వసతులను కల్పించవచ్చు.
6. ఒక వేదాంతి దృష్టిలో ఈ యుద్ధం
ఒక నిష్పక్షపాతమైన వేదాంతి దృష్టిలో ఈ యుద్ధం ఒక రాజకీయ చదరంగం కాదు, ఇది మానవాళి ఆధ్యాత్మిక పతనం. వేదాంతికి భౌగోళిక సరిహద్దులు కృత్రిమమైనవి. ఉపనిషత్తులు "ఈశావాస్యమిదం సర్వం" (సమస్తం భగవంతుని చేత వ్యాపించబడి ఉన్నది) అని ఘోషిస్తున్నాయి. మహా మహా రాజులు ఈ భూమి నాది, ఈ సామ్రాజ్యం నాది అనుకుంటూ చివరకు మట్టిలో కలిసిపోయారు. వారిని చూసి ఈ భూమాత నవ్వుతుందట. అలెగ్జాండర్ లాంటి గొప్ప వీరుడు కూడా ఖాళీ చేతులతోనే వెళ్ళిపోయాడు.
ఈ యుద్ధోన్మాద నాయకులు నెత్తురు పారించి ఎన్నిటినో పొందుతున్నారు, ఎన్నో విజయాలు సాధిస్తున్నారు. ఇవన్నీ పొందినా వాటి వలన వారి అహం పూర్తిగా శాంతిస్తుందా? అది అసంభవం. వస్తు మరియు విషయ ప్రీతి మనిషి జీవించి ఉన్నంత కాలం వాడిని వెంటాడుతూనే ఉంటుంది. అట్టి వాడు ఇన్ని సాధించినా సుఖంగా ఉన్నాడా? ఉండగలుగుతున్నాడా? దీనికి ఒకే ఒక స్పష్టమైన, ఖచ్చితమైన సమాధానం "లేదు". ఎందుకంటే ఇవన్నీ 'ప్రకృతి సంసిద్ధం' అనగా ప్రకృతికి చెందినవి, ప్రకృతి ద్వారా ఉద్భవించినవి. అవి ప్రకృతికి మాత్రమే చెందుతాయి తప్ప ఏ ఒక్క మానవుడికి కాదు.
అందుకే మనిషి తనదని సాధించానని అనుకుంటున్న ప్రతి ఒక్కటీ ఏదో ఒకరోజు నశిస్తుంది. నశించిన మరుక్షణం వాడికి దుఃఖమే మిగులుతుంది, తీవ్రమైన అశాంతి ఉంటుంది. అందుకే "అశాన్తస్య కుతః సుఖం" అనే గీతా వాక్యం శ్రీ శఙ్కర భగవత్పాదుల భాష్యంతో వీరికి చక్కగా వర్తిస్తుంది. కేవలం కొద్ది కాలం అనుభవించే అధికారం కోసం భగవంతుడి ద్వారా సృష్టించబడిన ప్రకృతిని మరియు జీవరాశిని (మనుషులతో సహా) సంహరించడం అజ్ఞానం యొక్క పరాకాష్ఠ. వేదాంత దృష్టిలో నిజమైన విజయం శత్రువుల రాజ్యాలను జయించడం కాదు, తమలోని అరిషడ్వర్గాలను జయించడం.
ముగింపు: "వసుధైక కుటుంబం" (ఈ ప్రపంచమంతా ఒకే కుటుంబం) అనే సనాతన ధర్మాన్ని మానవాళి ఆచరణలో పెట్టిననాడే, నాయకులలో ఈ "వస్తు-విషయ సఙ్గం" నశించి ప్రపంచంలో నిజమైన శాంతి నెలకొంటుంది.
స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీశాః ।
గో బ్రాహ్మణేభ్య శ్శుభమస్తు నిత్యం లోకాస్సమస్తా స్సుఖినోభవంతు ।।
నమిలికొండ విశ్వేశ్వర శర్మ