శ్రీ గణేశాయ నమః
శ్రీ మాత్రే నమః
శుభగ్రహ
చతుర్గ్రహా - పఞ్చగ్రహా కూటములు – యుద్ధ భయం
నాలుగు లేదా ఆపై గ్రహాల కూటములు సహజంగా కూడా దేశకాల పరిస్థితులపై ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తాయి. చరిత్రలో దీనికి పలు నిదర్శనాలు కనిపిస్తాయి. ప్రస్తుతం, కుంభ రాశిలో ఇట్టి ప్రతికూల గ్రహ యోగాలు ఉన్నాయి. అప్పటికే కుంభ రాశిలో సంచరిస్తున్న రవి, బుధ, శుక్ర మరియు రాహువు భ ల చతుర్గ్రహా కూటమి తో 24.02.2026 నాడు కుజ భ కుంభ రాశిలో ప్రవేశించడం వలన పఞ్చగ్రహా కూటమిని ఏర్పడింది. ఇట్టి పఞ్చగ్రహా కూటమే పాలకులను యుద్ధానికి ప్రోత్సహించిందని చెప్పవచ్చు.
రవి భ – రాజులు, రాచరికాలు, రాజ్యాలు, పాలనలు
కుజ భ – సైన్యం, ఆయుధాలు, యుద్ధాలు
బుధ భ – తొందరపాటు తనాన్ని ప్రసాదించు వాడు
శుక్రుడు భ – దైత్య గురువు, దైత్యులకు అధిపతి
రాహువు – భ్రమ, తొందరపాటుతనం, అనాలోచిత నిర్ణయాలు
కుంభం – వాయు తత్త్వ రాశి. ఆయుష్కారకుడైన శని అధిపతి
వాయు తత్త్వ రాశి అయిన కుంభ రాశి రవి, కుజ మరియు రాహువు భ లకు శత్రు క్షేత్రం. శత్రు క్షేత్రంలో ముగ్గురు మిత్రుల కలయిక అత్యంత ప్రమాదకరమైనది. అప్పటికే మసలుతున్న వివాదం 24.02.2026 నాడు కుజ భ కుంభ రాశిలో ప్రవేశించిన పిదప యుద్ధం రూపం దాల్చింది. యుద్ధం మరియు దాని పర్యవసానాలు ఆలోచించకుండా, తొందరపాటుతనం తో, మొండితనం మరియు అహంకార ప్రవృత్తికి కారణమైన అంగారకుడు రంగంలోకి దిగగానే 28.02.2026 నాడు కట్టలు తెగిన ఆవేశం, అజ్ఞానం వలన యుద్ధం కార్యరూపం దాల్చింది.
కుజుడు ఆయుధాలకు అధిపతి, రవి రేడియేషన్ ను విడుదల చేయు గ్రహ. “అణుబాంబు” కు ఈ రెండు గ్రహాలే ప్రధానమైనవి. ఈ రెండూ కూడా ‘అణుబాంబు’ వివాదాన్ని సృష్టించి, అదే వివాదం యుద్ధానికి కూడా కారణమైంది. అందులోకి కుంభం వాయు తత్త్వ రాశి అగుట వలన వాయు దాడులే జరుగుతున్నాయి. కుంభ రాశి జల రాశి అగుట వలన ఇందుకు సముద్ర జలాలు కూడా తోడైనాయి. శని భ నూనె మరియు చమురుకు అధిపతి అగుట వలన ఆయన స్వక్షేత్రమైన కుంభం లో ఏర్పడ్ద ఈ యోగం ప్రపంచంలో చమురు ధరలు విపరీతంగా పెరిగే విధంగా కూడా చేశాయి.
ఇట్టి గ్రహ యోగం 15.03.2026 నాడు రవి భ మీన సంక్రమణం చేసిన పిమ్మట బలహీనపడుతుంది. అదే యుద్ధ విరామానికి కారణం కూడా కానుంది. అనగా 15.03.2026 మొదలు యుద్ధం క్రమంగా తగ్గు ముఖం పట్టే అవకాశం కలదు.
స్వస్తి ప్రజాభ్యః పరిపాలయన్తాం న్యాయేన మార్గేణ మహీం మహీశాః |
గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవన్తు ||
#పంచగ్రహకూటమి #జ్యోతిషశాస్త్రం #మేదినీజ్యోతిషం #కుంభరాశి #గ్రహస్థితులు #లోకాస్సమస్తాస్సుఖినోభవంతు
నమిలికొండ విశ్వేశ్వర శర్మ, సిద్ధాంతి
10.03.2026
Chaturgraha & Panchagraha Kootami: The Threat of War
Conjunctions of four or more planets naturally exert an adverse influence on global conditions and times. History provides several examples of this. Currently, such unfavorable planetary combinations are occurring in the sign of Aquarius (Kumbha Rasi). The four-planet conjunction of the Sun, Mercury, Venus, and Rahu, which was already transiting Aquarius, turned into a five-planet conjunction (Panchagraha Kootami) when Mars entered the sign on February 24, 2026. It can be confidently said that this specific five-planet conjunction is what encouraged rulers to go to war.
· Sun (Ravi): Signifies kings, monarchies, kingdoms, and governance.
· Mars (Kuja): Signifies the army, weapons, and wars.
· Mercury (Budha): The bestower of hastiness and impulsiveness.
· Venus (Shukra): The Preceptor (Guru) and Lord of the Daityas (demons).
· Rahu: Signifies illusion, impulsiveness, and thoughtless decisions.
· Aquarius (Kumbha): An Air (Vayu) element sign. Ruled by Saturn (Shani), the significator of longevity (Ayushkaraka).
Aquarius, being an air sign, acts as an enemy camp for the Sun, Mars, and Rahu. The convergence of three mutual friends in an enemy's domain is highly dangerous. The already simmering dispute escalated into a full-blown war after Mars entered Aquarius on February 24, 2026. Mars, being the significator of stubbornness and egoistic tendencies, entered the battlefield without any regard for the consequences. Driven by impulsiveness, uncontrollable aggression, and ignorance, the war materialized on February 28, 2026.
Mars is the lord of weapons, and the Sun is the planet associated with the release of radiation. These two planets are the primary significators of a "Nuclear Bomb." Together, they triggered a nuclear controversy, which ultimately became the cause of the war. Furthermore, since Aquarius is an air sign, we are witnessing airstrikes. As the sign of Aquarius (the water bearer) also has associations with water, oceanic territories have been drawn into this conflict. Additionally, Saturn is the lord of oil and petroleum; therefore, this planetary combination occurring in his own sign of Aquarius has caused global oil prices to skyrocket.
This planetary combination will begin to weaken after the Sun transits into Pisces (Meena Sankramana) on March 15, 2026. This transit will pave the way for a ceasefire. Consequently, there is a strong possibility that the war will gradually begin to subside from March 15, 2026, onwards.
Swasti Prajabhyah Paripalayantam Nyayena Margena Mahim Mahishaha |
Go Brahmanebhyah Shubhamastu Nityam Lokah Samastah Sukhino Bhavantu ||
(May well-being be unto all the people. May the leaders rule the earth along the righteous path. May there be perpetual well-being to all sacred beings and scholars. May all beings in all the worlds be happy.)
#VedicAstrology #MundaneAstrology #PanchagrahaKootami #PlanetaryTransits #WorldPeace #AstrologyPredictions
Namilikonda Vishweshwar Sharma, Sidhanti
10.03.2026